Followers

సీఎం సహాయనిధి ద్వారా 18 మందికి చెక్కుల పంపిణీ

 సీఎం సహాయనిధి ద్వారా 18 మందికి చెక్కుల పంపిణీ 

 సత్యవేడు,  పెన్ పవర్ 

రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 18 మందికి మంజూరైన 14 లక్షల 14 వేల రూపాయలను స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు .సోమవారం  సత్యవేడు ఫారెస్ట్ అతిథి భవన ప్రాంగణంలో వైఎస్ఆర్సిపిమండల కన్వీనర సుశీల్ కుమార్ రెడ్డి ,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బాలాజీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన నిధులకు సంబంధించి చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేయడం జరిగింది . చెక్కులను అందుకున్న వారిలో అంకయ్య రెడ్డి 90,000 ,సిపాయి విక్రమ్ 85,000, సులోచన 65,000, నాగరత్నమ్మ 30,000 మురళి ఒక లక్షా అరవై వేలు ,దినేష్ కుమార్ 35,000 పాల్యం ఒక లక్షా 25 వేలు ,పృథ్వి రాజ్ 25,000, రమణారెడ్డి ఒక లక్ష యాభై వేలు , బాబు 28,000, కే మధు 35,000 కే లలిత 85,000 ఆనంద్ రెడ్డి ఒక లక్షా నలభై వేలు , గోపాల్ రెడ్డి ఒక లక్ష 10 వేలు , తులసమ్మ 65,000  ప్రభాకర్ రెడ్డి ఒక లక్షా నలభై వేలు , కిషోర్ 28,000 పి గణేష్ 18 వేల రూపాయలు తదితరులు ఉన్నారు .అనారోగ్యానికి గురైన వీరందరూ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నారు .ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు .నిరుపేదలను ఆదుకోవాలని ఉద్దేశంతో దీనిపై ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు అయ్యాయి .ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ పేదల ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు .దీంతోపాటు అనుకోకుండా అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో  వైద్యం చేయించుకున్న నిరుపేదలకు ఆసరాగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు .ఈ కార్యక్రమంలో సింగిల్విండో అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి ,బెల్ట్ రమేష్ , వెంకటేశులు ,మస్తానమ్మ ,గురుప్రసాద్ , ధర్మయ్య ,ఎంపి రవి తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...