18న ప్రైవేటీకరణ వ్యతిరేక సభ జయప్రదం చేయండి
పెన్ పవర్ విజయనగరంకేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 18వ తేదీన గురజాడ కళాభారతి లో జరుగు ప్రైవేటీకరణ వ్యతిరేక సభలో అందరూ పాల్గొనాలని ఏఐటియుసి, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, కార్మిక, విద్యార్థి, యువజన ఉద్యోగ మరియు పెన్షన్దార్ల సంఘల నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రైవేటీకరణ వ్యతిరేకసభ ప్రచార గోడపత్రికను అమర్ భవన్ లో బుగత అశోక్, టీ జీవన్, ఎస్. సునీల్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను, పరిశ్రమలను అతిచౌకగా గుజరాతి కార్పొరేట్లకు అమ్మేయడం అత్యంత దారుణం అని ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షలాదిమంది కార్మికులు ఎన్నో ఏళ్ళు మిలిటెంటు పోరాటాలు నిర్వహించడమే కాకుండా ఆనాడు బ్రిటిష్ వారితో సైతం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు అన్నిటిని నేడు కేంద్రంలో అధికారంలో కాషాయ ప్రభుత్వం 4 న్యూవేజ్ బార్ కోఢ్ లుగా విభజించి కార్మిక చట్టాలను సవరణ చేస్తూ కార్మికులందరికీ కనీస వేతనాలు లేకుండా, మార్చేందుకు బిజెపి ప్రభుత్వం కుటిలయత్నాలకు పాల్పడుతుందన్నారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఎల్ఐసీ, బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎయిర్ పోర్టులు, బ్యాంకులు ఇలాంటి అనేక సంస్థలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను నల్ల చట్టాలు తెచ్చి సైతం నడ్డివిరిచే విధానాలను అవలంభిస్తున్నారు. కార్మిక, కర్షకుల జీవితాలను కార్పొరేట్ల దగ్గర బానిసలుగా చేయడానికి మోడీ తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగే బహిరంగ సభలో ఉద్యోగులు, కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్పురుబోతు జగన్నాథం, వెలగాడ రాజేష, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment