చౌడపూర్లో 16 లక్షలతో సిసి రోడ్డు కు శంఖుస్థాపన చేసిన పరిగి ఎమ్మెల్యే
వికారాబాద్ , పెన్ పవర్
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలంలోని చౌడపూర్ గ్రామంలో 16 లక్షల రూపాయలతో జి పి నిధులతో సిసి రోడ్లు ప్రారంభించిన శాసనసభ్యులు కొప్పుల మహేశ్వర్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సిసి రోడ్లను మంజూరు చేయడం జరిగిందని నాయకులు ముందుకు వచ్చి గ్రామాలకు అవసరమున్న రోడ్లను మంజూరు మంజూరు చేయించుకుని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అధ్యక్షులు మీ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రజలకు అందజేసిందని, ఇలాంటి పథకాలను ప్రజలు ఉపయోగించుకొని గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని ఆయన నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జెడ్ పి టి సి ఎం పి పి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment