16 న చార్లి చాప్లిన్ 132 వ జయంతి...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ
మహారాణి పేట, పెన్ పవర్
ఈ నెల 16 న ప్రపంచ ప్రముఖ హాస్య నటుడు దివంగత చార్లి చాప్లిన్ 132 వ జయంతిని నిర్వహించాలని వైజాగ్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ఆచార్య ఎన్.ఎ.డి పాల్ మరియు కార్యదర్శి నరవ ప్రకాశరావు ఏ. యు. హెచ్.ఆర్.డి. సెంటర్ లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచ సినీ జగత్తులో ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న చాప్లిన్ జీవితం నేటి తరానికి ఆదర్శం కాగలదని నమ్మకం తో వైజాగ్ ఫిల్మ్ సొసైటీ గత 10 ఏళ్ల గ చాప్లిన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమం లో చాప్లిన్ మొదటిసారిగా పూర్తి నిడివి గల మూఖి చిత్రం ధి కిడ్ ప్రదర్సిస్తారు. ఈచిత్రము విడుదలయి నేటికీ 100 సంవత్సరాలు పూర్తి ఐయ్యింది .ఈ ఉత్సవం 16 న (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు ఏ.యు. హెచ్.ఆర్.డి లో జరుగుతుంది ఏయు విసి మరియు ఆచార్య ఎన్.ఎ.డి.పాల్,నటుడు ఏస్.కె.మిశ్రో, తదితరులు పాల్గొంటారు. ప్రవేసము ఉచితము. వివరాలకు నరవ ప్రకాశరావు 9032477463 సంప్రదించగలరు.
No comments:
Post a Comment