Followers

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ 151 వ జయంతి

 భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ 151 వ జయంతి

బెల్లంపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భారత కమ్యూనిస్టు పార్టీ  కార్యాలయంలో ప్రపంచ విప్లవాల రథసారథి సోవియట్ విప్లవ విముక్తి నాయకుడు కామ్రేడ్ లెనిన్ 151 వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి కార్పొరేట్ శక్తులకు, ముకేశ్ అంబానీ,  ఆదాని లకు ఈ దేశాన్ని ఈ కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని తాకట్టు పెడుతూ భారతదేశానికి మనుగడ లేకుండా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ విలువలను కాపాడకుండా నిస్సిగ్గుగా   వ్యవహరిస్తున్న నాటి నాజీలను హిట్లర్ దురహంకారాన్ని పెంపొందించుకొని పరిపాలిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా మార్కిస్టు ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ వారసత్వంగా కార్మిక వర్గ పట్టుదలతో కార్మికులు రైతులు యావత్ భారత ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపెల్లి వెంకటస్వామి ప్రసంగించారు. అలాగే ఈ కార్యక్రమంలో జి. సి. మాణిక్యం సిపిఐ పట్టణ కార్యదర్శి ఏల్తురు శంకర్ ఏ ఐ టి యు సి కార్యదర్శి ప్రసంగించారు. అలాగే సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఆడెపు రాజమౌళి బి కే ఎన్ యు నాయకులు, అక్క పెళ్లి బాపు, సాగే గట్టయ్య, రత్నం  రాజం, జి. శంకర్, బొంకూరి రామచందర్,  భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు  చిప్ప కుర్తి బాపు, ఆవునూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...