కామ్రేడ్ లెనిన్ 151 వ జయంతి సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘన నివాళి
కామ్రేడ్ లెనిన్ 151వ జయంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలో ఎమ్మెస్సార్ షాపింగ్ ఆవరణం నందు కామ్రేడ్ లెనిన్ చిత్రపటానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు నాయకులు చేత కామ్రేడ్ లెనిన్ ఆశయాలను కొనసాగించాలని ప్రతిజ్ఞ చేయించారు. మార్క్సిజం-లెనినిజం వర్ధిల్లాలని, సమసమాజ స్థాపన కోసం కార్యకర్తలు పనిచేయాలని కామ్రేడ్ లెనిన్ పోరాటాన్ని చరిత్రను కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘ నాయకులు సత్యమూర్తి, దాసరి చంద్ర, గిడ్డు బాయ్, గంగాధర్ గణపతి, రఘు, విజయగౌరి రమాదేవి, దేవయాని తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment