Followers

ఏప్రిల్ 14న ఓయూ లో జార్జ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలు

ఏప్రిల్ 14న ఓయూ లో జార్జ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలు - పిడిఎస్యూ 

తార్నాక , పెన్ పవర్ 

ఏప్రిల్ 14న ఓయూ లో జార్జ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలిపింది.  పిడిఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లోని గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు  జూపాక శ్రీనివాస్,  పిడిఎస్యూ ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము లు  మాట్లాడుతూ సమానత్వ సమాజ స్థాపన కోసం  జార్జ్ రెడ్డి అసమాన పోరాటం చేసి ఎన్నో తరాలకు దిక్సూచిగా నిలిచాడని అని కొనియాడారు. జార్జ్ పోరాటం సిద్ధాంతం మతోన్మాద ఆధిపత్య వర్గాల గుండెల్లో వణుకు పుట్టించిన అందుకే ఆయనను భౌతికంగా నిర్మూలించి ఆయన భావాలను  నిలిపివేయాలని కుట్ర చేశారని అన్నారు. ఆ కుట్రలో భాగంగానే  జార్జ్ ను హత్య  మతోన్మాద గుండాలు హత్య చేశారని అన్నారు. జార్జ్ మరణం వేల మంది పోరాట యోధులను సృష్టించి మతోన్మాదుల కు సింహస్వప్నం అయిన పీ డీ ఎస్ యు సంస్థను  స్థాపించింది అని  అన్నారు. ప్రభుత్వ సంస్థలను విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  జార్జిరెడ్డి  49 వ వర్ధంతి సభలను ఉస్మానియా యూనివర్సిటీ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు.  ఏప్రిల్ 14న ఉస్మానియా యూనివర్సిటీ లో మార్నింగ్ వాక్ తో ప్రారంభమయ్యే జార్జి సంస్మరణ కార్యక్రమాలు సభలు సమావేశాలు ప్రదర్శనలు ఎగ్జిబిషన్లు సెమినార్లు గ్రూప్ మీటింగులు ఇలా తదితర రూపాల్లో విస్తృతంగా జార్జి అమరత్వాన్ని స్మరిస్తు  జార్జ్ కు నివాళులు తెలిపారు. జార్జ్ అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు ప్రగతిశీల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో  భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం లో పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు  ఎస్ .నాగేశ్వరరావు , పిడిఎస్యు. స్టేట్ జాయింట్ సెక్రెటరీ పి మహేష్, పీడీఎస్యూ నాయకులు  అనిల్ , గడ్డం.శ్యామ్, మధు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...