లాక్ డౌన్ పెట్టండి లేదా 144 సెక్షన్ ను కఠినంగా అమలుచేయండి
జిల్లాలో తక్షణమే లాక్ డౌన్ విధించండి లేదా 144 సెక్షన్ ను కఠినంగా అమలు చేయాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణరావు(బాలు) శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రికాప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి రెండోవేవ్ లో ప్రపంచ దేశాలతోపాటు మన జిల్లా ప్రజలకు కరోనా కేసులు వెలకొద్ది పెరగడం, ఓపక్క ఎక్కువ మరణాలు సంభవించడం ప్రజలను భయబ్రాంతులకు గురుచేస్తుస్తున్నాయని ఇటువంటి తరుణంలో రాత్రిపూట కర్ఫ్యూ ఏమి ఉపయోగం ఉండదని, ప్రజలకు సేవచేసే జిల్లా యంత్రాంగం,ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు,మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు మరియు సిబ్బంది,పోలీసులు, వైద్య సిబ్బంది, ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులు కరోనా బారినపడి ప్రజలతోపాటుగా ప్రాణాలుమీదకు తెచ్చుకుంటున్నారని, ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించినా పట్టణంలో ప్రధాన కేంద్రాలైన గంటస్థంభం పెద్ద మార్కెట్,కోట జంక్షన్, రైతుబజార్లు,కాకుండా వివిధ ప్రధాన కూడళ్లలో ప్రజలు గుమిగూడి ఉంటున్నందున ప్రజలంతా అవస్థలు పడుతున్నారన్నారు. ఇటువంటి తరుణంలో లాక్ డౌన్ ను విధిస్తే గాని ఉదృతంగా పెరుగుతున్న కరోనాను అరికట్టలేమని అన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలందరూ కారోనాపై అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని,ప్రతీఒక్కరూ మాస్కులు ధరించాలని,ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని అన్నారు. ఈ విపత్కర పరిస్థితులను ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకొని లాక్ డౌన్ గాని, 144 సెక్షన్ ను కఠినంగా వ్యవహరించాలని కోరారు.
No comments:
Post a Comment