Followers

గోకవరం డిపోలో 135 వ మేడే సంబరాలు

గోకవరం డిపోలో 135 వ మేడే సంబరాలు

గోకవరం,  పెన్ పవర్

ఏపీఎస్ఆర్టీసీ గోకవరం డిపో లో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో 135 వ మే  డే ఉత్సవాలు కోవిడ్ నిబంధనలు అనుసరించి జరుపుతున్నట్లు ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి పైడి మళ్ళ. లక్ష్మణ రావు శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1886 మే ఒకటో తేదీన చికాగో నగరంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పై జరిగిన మారణకాండ ఫలితంగా వారి రక్తంతో తడిచి, ఉదయించిన ఎర్ర జెండా సాక్షిగా కార్మిక చట్టాలు మార్పు, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన రోజైనా మే ఒకటో తేదీ కార్మిక దినోత్సవం గా జరుపుకుంటు నట్లు ఆనవాయితీగా వస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు ప్రగడ ప్రసాదు, సంయుక్త కార్యదర్శి అక్కిరెడ్డి కృష్ణ, బికే పాదం, బూసి గంగరాజు, శేఖర్,కవల . రామకృష్ణ, అప్పాజీ, బంగారం తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...