ఘనంగా ఘాటు పొలమ్మ 13వ త్రయోదశ వార్షికోత్సవం
సంతబొమ్మాలి,పెన్ పవర్మండలంలో ఆకాశ లక్కవరం గ్రామంలో అసిరి తల్లి, ఘాటు పొలమ్మ 13వ త్రయోదశ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హోమం, మరియు కుంకుమ పూజలు గ్రామ పెద్ద భాస్కర్ రావు చేతులమీదుగా నిర్వహించగా, పరపటి రాము అన్నదాన కార్యక్రమాన్ని, కరువులు అప్పలకొండ పూజా కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది.
పూజారి మామిడి లక్ష్మీ గణపతి శర్మ మాట్లాడుతూ ఈ హోమం గ్రామ సంరక్షణ మరియు కరోనా బారిన పడకుండా అందరూ క్షేమంగా ఉండాలని ఈ హోమం, కుంకుమ పూజలు జరిపించమని, ప్రతి ఒక్కరు జాగ్రత్త లు పాటించాలని తెలిపారు. అనంతరం పిల్లలతో నాటిక కార్యక్రమాన్ని వేయించి పెద్దల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగ్గు రామిరెడ్డి, పరపటి వసంత రావ్, భానుచందర్, రాజు, ఎర్రయ్య సంజీవ్, పాపారావు, సోమేశ్, భాస్కర్ రావు, గురుమూర్తి, మాకులు, కామేష్ , రామారావు అప్పన్న, వీరన్న, వసంత్, బీమా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment