జుత్తాడ బాధిత కుటుంబాలకు 12లక్షల చెక్కును అందజేసిన విజయసాయి రెడ్డి
విశాఖ తూర్పు, పెన్ పవర్
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని వైకాపా జాతీయ కార్యదర్శి,వైకాపా రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. పెందుర్తి మండలం జుత్తాడ హత్యాకాండలో బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరుపున మృతులు ఒక్కొక్కరికి 2 లక్షలు చొప్పున మొత్తం 12 లక్షల చెక్కును శివజీపాలెం లోని బాధిత కుటుంబ సభ్యుల నివాసంలో శుక్రవారం ఉదయం అందజేశారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఏ1( అప్పలరాజు)ని ఇప్పటికీ పోలీస్ కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. ఏ2 (బత్తిన శ్రీను) హోమ్ గార్డును విధులు నుండి తొలగించి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఏ3, ఏ4 లను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు.బాధిత కుటుంబాలకు త్వరిత గతిన న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో నగర మేయర్ గోలగాని వెంకట హరి కుమారి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు, నగర వైకాపా పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment