Followers

యాదమరి మండలంలో 12 లక్షల 50 వేల రూపాయల విలువగల ఎర్రచందనం పట్టివేత..

యాదమరి మండలంలో 12 లక్షల 50  వేల రూపాయల విలువగల  ఎర్రచందనం పట్టివేత..

 చిత్తూరు,  పెన్ పవర్

 మండల కేంద్రమైన యాదమరిలో పోలీసులు జరిపిన మెరుపుదాడిలో, ఖచ్చితమైన సమాచారం మేరకు  చిత్తూరు  డి ఎస్ పి సుధాకర్ రెడ్డి  ఆధ్వర్యంలో, చిత్తూరు ఎస్ఇబి డిఎస్పీ పోతురాజు  ఆదేశాల మేరకు చిత్తూరు రూరల్ వెస్ట్ సి ఐ శ్రీ లక్ష్మీ కాంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో  యాదమరి ఎస్ ఐ యు. ప్రతాప్ రెడ్డి మరియు కానిస్టేబుల్స్  జయశంకర్ రెడ్డి,  శరత్ రెడ్డి, గోపి రెడ్డి, ప్రేమ్ ఇంద్ర ల తో కలసి  యాదమరి మండలం, కమ్మరయని మిట్ట  గ్రామానికి సమీపంలో నివా నది పక్కన (పిల్ల వంక) లో 30 ఎర్రచందనం దుంగలు స్వాధీనపరుచుకున్నారు. 

అక్రమంగా ఎర్రచందనం  దుంగలను  నదిలో భద్రపరిచారని  20 వ తేదీ సమాచారం అందుకున్న పోలీసులు నిఘా లో ఈరోజు ఉదయం అక్రమ రవాణాపై వచ్చినా సమాచారం తో ఉదయం సుమారు నాలుగు గంటలకు అక్కడికి వెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి మరియు సిబ్బంది తో కలసి ముక్తార్, మెయిస్, మరియు జలీల్ ఖాన్ లను పట్టుకోవడానికి ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి పారిపోతుండగా సిబ్బంది సహాయం తో వెంబడించి ఇద్దరు పారిపోగా జలీల్ ఖాన్ ను పట్టుకుని వారి నుంచి 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు ...వాటి విలువ సుమారు 12 లక్షల 52 వేల రూపాయలు ఉంటుందని ఇంఛార్జి సి ఐ త్యాగరాజు తెలిపారు .. ముద్దాయిని అరెస్టు చేసి  రిమాండ్ కు తరలించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...