Followers

ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ 113వ జయంతి వేడుకలు

 ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ 113వ జయంతి వేడుకలు

గోకవరం, పెన్ పవర్

మండల కేంద్రమైన గోకవరం లో స్థానిక బాబు జగ్జీవన్ రావ్ కమ్యూనిటీ భవనంలో.డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్  113 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ గోకవరం మండల అధ్యక్షులు గర భారపు శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ. డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్  అలుపెరుగని పోరాట యోధుడు. అవనిపై ధీరుడు.  దేశ స్వతంత్రం కోసం. సామాజిక సమానత్వం కోసం. అనగారిన వర్గాల వారి హక్కుల కోసం.  అలుపెరగని సమరం సాగించిన విప్లవ యోధుడు. భారత స్వతంత్ర సమరంలో పాలుపంచుకుని.జైలు జీవితాన్ని కూడా అనుభవించి . నవభారత నిర్మాణానికి విశేష కృషి చేసి...మన దేశ అగ్రగణ్య నాయకుల్లో  ఒకరిగా నిలిచిన నాయకులు డా " బాబు జగజ్జీవన్ రావ్  దేశభక్తే శ్వాసగా. దళిత జన ధోరణే లక్ష్యంగా. స్ఫూర్తినిచ్చిన నాయకులు డా" బాబు జగజ్జీవన్ రావ్  ఆయన్ని సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డా" జగజ్జీవన్ రావ్ దైవంగా కొలిచే దళిత నాయకులు శ్రీ వరసాల ప్రసాద్ గోకవరం మండల జడ్పిటిసి వైసిపి అభ్యర్థిని శ్రీ దాసరి శ్రీ రంగ రమేష్   మరియు 1 వార్డు ఎంపీటీసీ వైసిపిఅభ్యర్థిని తోలేటి రమ్య శ్రీ ప్రసాద్ , డా జగజ్జీవన్ రావ్  కు పూలమాల వేసి ఆయనను  ఆదర్శంగా తీసుకొని.  ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. బివి చంద్రం, బి ఆనంద్, టి రాంప్రసాద్, బి రాము. జి భజినీ, బి నాగరాజు. టి. చందర్రావు, సి హెచ్ సూరిబాబు, పి శ్యామల్రావు, కె. శ్రీను, బి బాపిరాజు, పి దొరబాబు, సి హెచ్.శ్రీను, బి కిరణ్, జి రాంబాబు,వి.శ్రీను పి విక్రం, బి మధు, ఐ.కిరణ్.  వైశ్రీన  ఎమ్.చిన్న బాబు. తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...