Followers

11వ రోజుకు చేరిన ఆశావర్కర్ల దీక్షలు

 11వ రోజుకు చేరిన ఆశావర్కర్ల దీక్షలు

పెన్ పవర్,  రంపచోడవరం 

రంపచోడవరం ఏజెన్సీలో పనిచేస్తున్న గిరిజన ఆశావర్కర్ల  సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పదకొండవ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)రాష్ట్ర నాయకురాలు మట్ల.వాణిశ్రీ మాట్లాడుతూ న్యాయ బద్దంగా ఆశావర్కర్లకు రావలసిన బకాయిలు ఇవ్వటంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, వేతన బకాయిలు చెల్లించాలని చేపట్టిన రిలే దీక్షలు పదకొండవ రోజుకు చేరినప్పటికి అధికారుల్లో మాత్రం ఎటువంటి  స్పందన లేకపోవటం సిగ్గు చేటని ఆమే హెద్దెవా చేశారు.

 క్షేత్ర స్థాయిలో ఎన్నో కష్టాలను అదిగమించి పని చేస్తున్న ఆశవర్కర్లకు రావలసిన వేతనాలు వారికీ ఇవ్వకుండా ఎవ్వరి ఖజానాకు చేరయో పూర్తి విచారణ జరిగే వరకు దీక్షలు విరమించేది లేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే  ఏజెన్సీ మొత్తం రేపు 5,వ తారీకు నుంచి సమ్మెలోకి వెల్తూ.. ఈ ఆందోళనని మరింత ఉదృతం చేస్తామని ఆమే హెచ్చరిక చేశారు. ఈ యెక్క ఆందోళనకి మద్దతుగా యునైటెడ్ మెడికిల్ & హెల్త్ జిల్లా నాయకులు బిత్తరి.యోహాను వారి సంఘం నుంచి సంపూర్ణ మద్దత్తు తెలియ జేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...