విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా 10 పరీక్షలను రద్దు చేయాలి
వరదయ్య పాలెం, పెన్ పవర్
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలని చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రాజశేఖర్ కోరారు .శుక్రవారం 10 పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఫోన్ ద్వారా మీడియాతో మాట్లాడారు .కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం రెండవ సారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి తగదన్నారు . ఇప్పటికే కరోనా వైరస్ కోరలు చాచడంతో దీని బారిన పడ్డా పలువురు ప్రాణాలు గాలిలో కలసిపోవడం ఆందోళన కలిగిస్తున్నటు ఆయన చెప్పారు .ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు నిర్వహించడం సహేతుకం కాదన్నారు . ఇప్పటికే తెలంగాణ ,మహారాష్ట్ర ,పంజాబ్ , హర్యానా ,జమ్మూ కాశ్మీర్ ,ఉత్తరాఖండ్ , తమిళనాడు ,ఢిల్లీ వంటి రాష్ట్రాలు 10 పరీక్షలను రద్దు చేసినట్లు ఆయన గుర్తు చేశారు .మిగిలిన రాష్ట్రాల్లో కొన్ని పరీక్షలను వాయిదా వేయడం జరిగింది అన్నారు .కేంద్ర ప్రభుత్వం కూడా సిబిహెచ్సి ,ఐ సిఎస్సి వంటి పరీక్షలను రద్దు చేయడం జరిగిందన్నారు . ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ,పిల్లలతల్లిదండ్రులు కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం పొంచి ఉందన్నారు .తద్వారా రాష్ట్రంలో 75 లక్షల మందికి ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు .అందుకని పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు .దీనిపై పౌర సమాజం ,విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తున్న ప్రభుత్వం పది పరీక్షలు రద్దు చేయడంలో మీన మేషాలు లెక్కిస్తున్నటు ఆయన విమర్శించారు . ఇప్పటికైనా దీనిపై మొండిపట్టు విడనాడి విద్యార్థుల ఆరోగ్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పదవ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు .
No comments:
Post a Comment