10వ రోజుకు చేరిన ఆశావర్కర్ల దీక్షలు
రంపచోడవరం, పెన్ పవర్
ఆశావర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో పదవ రోజుకు చేరాయి. ఈ సందర్బంగా ఆశావర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకురాలు మట్ల.వాణిశ్రీ మాట్లాడుతూ...దీక్షలు పదవ రోజుకు చేరినప్పటికి ఆరోగ్యశాఖ అధికారుల్లో ఎటువంటి స్పందన లేకపోవటం పట్ల ఏపీ ఆశావర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)తీవ్రంగా ఖండిస్తుందని ఆమే అన్నారు. ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్స్'ని పరిష్కరించటంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆమే ప్రశ్నించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని ఏజెన్సీ ఆశావర్కర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆమే కోరారు. మే 4,వ తారీకు లోపు సమస్యలు పరిష్కారం చెయ్యాలని లేని పక్షంలో మే5,వ తారీకు నుంచి 18,పీ.హెచ్.సి లలో సమ్మె నోటీసులు ఇచ్చి విధులు బహిష్కరిస్తారని, దశల వారి ఆందోళన ఉదృతం అవుతుందని ఆమే తెలిపారు. సమస్యల పరిష్కరానికి ఆలోచన చెయ్యకపోగా దీక్షల్లో ఉన్నా ఆశావర్కర్లపై వేధింపులకు పాల్పాడటం మానుకోవాలని,,పీ.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ల ఎకౌంట్ లలో జమ చేసిన ఆశావర్కర్ల వేతనాలపై పూర్తి విచారణ చేసి ఆశావర్కర్లకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆమే హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామల ఆశావర్కర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment