పిల్లల ఆరోగ్యం దృష్ట్యా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి
విజయనగరం, పెన్ పవర్
కోవిడ్-19 వైరస్ ఫస్ట్ వేవ్ కంటే, సెకండ్‌వేవ్ బాధితుల్లో చిన్నారులు, విద్యార్థులు ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, కాబట్టి టెన్త్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు, ఇంటర్ సెకండియర్ వాయిదా వేయాలని మాజీ శాససభ్యులు డా. కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. మన రాష్ట్రంలో 24 శాతం పాజిటివిటీ రేట్ ఉండటం తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. గతేడాది ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు కోవిడ్ వైరస్ వ్యాప్తి 11 శాతం అని, ఈ ఏడాది 20 నుంచి 40 శాతం వ్యాప్తి చెందిందని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ సంజీవ్ బగాయ్ చెప్పడం పరిస్థితి ప్రమాదకరంగా వుందని తేలుతోందన్నారు. మన రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ కలిపి 15 లక్షల మంది పిల్లలు పరీక్షలు రాయాల్సి వుందని, వీరి కుటుంబాలతో 75 లక్షల మంది, 30 వేల మంది ఉపాధ్యాయులు, వారి కుటుంబాలతో కలిసి 50 వేల మంది, పరీక్షల నిర్వహణకు పనిచేసే ఇతర సిబ్బంది 3.5 లక్షల మంది కలిపి దాదాపు కోటి మంది కరోనా బారిన ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 50 మంది ఉపాధ్యాయులు చనిపోయారని పేర్కొన్నారు. ఈ కరోనా సంక్షోభ సమయంలో లక్షల మంది ప్రాణాలు పణంగా పెట్టి పరీక్షలు నిర్వహించడాన్ని అన్నివర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. సచివాలయంలో అనేక మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, అలాంటిది వేల పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కరోనా రాదని ముఖ్యమంత్రి గ్యారెంటీ ఇవ్వగలగుతారా? అని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం ముఖ్యమంత్రికి తగదని సూచించారు. విద్యార్థుల భద్రతని పరిగణనలోకి తీసుకుని సీబిఎస్ఈ, ఐఎస్ సీఈ రద్దు చేసిన కేంద్రం ఉద్యోగ భర్తీ, ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిందని, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలు బోర్డు పరీక్షలను రద్దు చేశాయన్నారు. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్తాన్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల బోర్డులు టెన్త్ పరీక్షలు వాయిదా వేసుకున్నాయన్నారు. అన్ని రాష్ట్రాలూ ఇంటర్ సెకండియర పరీక్షల్ని వాయిదా వేసుకున్నాయని, ఏపీ మాత్రమే ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తుందో ఎవ్వరికీ అర్థంకాలేదన్నారు. నిన్న తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలియజేసేందుకు నారా లోకేష్ గారు ప్రకటించిన వాట్సప్ నెంబర్‌కి 9444190000కి సీబిఈes2021 మెసేజ్‌లు లక్షల్లో చేరాయి. ప్రకటించిన నిమిషాల్లోనే విద్యార్థులు 1.17 లక్షల సందేశాలు వచ్చాయి. ఒకేసారిగా లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాట్సప్ నెంబర్‌కి మెసేజ్‌లు చేయడంతో సెకనుకు 10 మంది సందేశాలందుకునే సర్వర్ మొరాయించింది. వెంటనే టెక్నీషియన్స్ స్పందించి అదనపు ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని అన్నారు. పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేష్ గారితో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు, తల్లిదండ్రులు ఉద్యమం చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయటానికి ధూళిపాళ్ల నరేంద్ర గారిని అరెస్ట్ చేశారని, 70ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్న కుటంబం, 45 ఏళ్లుగా సంగం డైరీని అత్యధిక లాభాలతో నడుపుతూ రైతులకు బోనస్సులు ఇస్తున్నారన్నారు. ఆముల్ లాంటి గుజరాతి సంస్థకు పాలు దోచివ్వలని జగన్ రెడ్డి చూస్తున్నారని, దాన్ని అడ్డుకొని రైతుల మద్దతుతో నరేంద్ర గారు నిలబడటాన్ని చూసి తట్టుకోలేక ఈ అరెస్టులని అన్నారు.
No comments:
Post a Comment