Followers

104 కు జిల్లాలోని అన్ని వైపుల నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయని ఆరా

 104 కు జిల్లాలోని అన్ని వైపుల నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయని ఆరా

చిత్తూరు, పెన్ పవర్

జిల్లా కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ 104 కు జిల్లాలోని అన్ని వైపుల నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఇంతవరకు ఎంత మందికి ఆరోగ్యం విషయంలో సలహాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ కంట్రోల్ రూమ్ ను శిక్షణ కలెక్టర్ అభిషేక్ తో కలసి సిబ్బందిని అడిగారు. ఈ సందర్భంగా సిబ్బంది కలెక్టర్ తో మాట్లాడుతూ వైద్య సహాయం కోసం కాల్ చేసే వారి ఈ విషయంలో సకాలంలో స్పందించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయని కొంతమందికి రెస్పిరేటరీ సమస్యలు ఉన్నాయని చెప్పడం జరుగుతోందని వారిని వెంటనే కోవిద్ కేర్ సెంటర్ కు వెళ్ళమని చెబుతున్నామని అదేవిధంగా ఇతర సమస్యలు ఉన్నవారికి ముందు పరీక్షలు చేయించుకుని తరువాత ట్రయాజ్ చేసుకోవాలని సలహా ఇస్తున్నామని చెప్పారు అదేవిధంగా హోమ్ ఐసోలాషన్ లో ఉన్నవారు ఎటువంటి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా వారు ఉన్న ప్రాంతం పేరు చెప్పి సంబంధిత ఆ ప్రాంతాన్ని పరిశీలించి డాక్టర్ నెంబర్లను అడుగుతున్నారని చెప్పారు. సిబ్బంది ఇది ఏ విధంగా పని చేస్తున్నారని మూడు షిఫ్టుల  ప్రకారం 24 గంటలు పని చేసి బాధితులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...