Followers

కోవిడ్ వ్యాక్సిన్ 100% సేఫ్ : బన్నాల గీత ప్రవీణ్

 కోవిడ్ వ్యాక్సిన్ 100% సేఫ్  : బన్నాల గీత ప్రవీణ్ 

తార్నాక , పెన్ పవర్ 

 ఉప్పల్ మున్సిపల్ పరిధిలోని  ఉప్పల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్  బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.  ఈ సందర్భంగా బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడిన వయసు వారు ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ఎటువంటి అపోహలకు గురి కాకుండా టీకాను వేసుకోవాలని, టీకా నుంచి 100% రక్షణ లభిస్తుందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు వ్యాక్సిన్ తీసుకొని వారు అందరూ కూడా మాస్కూలు ధరించాలని భౌతిక దూరాన్ని పాటించాలని, అతి అవసరం ఉంటే కానీ బయటకు రాకూడదని బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్వైజర్ ప్రకాష్ హాస్పిటల్ సిబ్బంది మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...