స్క్రాప్ షాపులో చోరీకి పాల్పడిన ఇద్దర్ని అరెస్టు చేసిన 1వ పట్టణ పోలీసులు
విజయనగరం,పెన్ పవర్
విజయనగరం 1వ పట్టణ పరిధిలో స్క్రాప్ షాపులో చోరీలకు పాల్పడిన ఇద్దరు నేరస్టులను ఏప్రిల్ 5న, అరెస్టు చేసినట్లుగా విజయనగరం డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ అనిల్ కుమార్ పులిపాటి తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. గత సంవత్సరం అక్టోబరు మాసంలోను, ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒకే తరహాలో నేరాలు జరిగి, సుమారు రూ.3.25 లక్షలు రాగి, ఇత్తడి స్క్రాప్ ను గుర్తు తెలియన వ్యక్తులు దొంగిలించుకొని వెళ్లిపోయినట్లుగా, షాపు యజమాని అబ్దుల్ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం 1వ పట్టణ పోలీసులు రెండు కేసులను నమోదు చేసారు.
ఈ రెండు నేరాలు ఒకే తరహాలో ఉండడంతో, ఒకే నేరస్థులు నేరాలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించి, సిసి ఫుటేజులను పరిశీలించారు. స్క్రిప్ షాపుకు దగ్గరలోగల వేరే షాపులో పని చేసే వాచ్మెన్ షాపులోకి రాత్రి సమయంలో ఒక టాటా ఏస్ వ్యాను వెళ్ళినట్లు, కొంత సమయం అయిన తరువాత వెళ్ళినట్లుగా తెలపడంతో, ఆ వాహనాన్ని గుర్తించేందుకుగాను విజయనగరం నుండి ఏలూరు వరకు గల చెక్ పోస్టుల వద్ద సిసి ఫుటేజులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు బృందం పరిశీలించడం జరిగింది. నక్కపల్లి వద్ద ఎపి 13 ఎక్స్ 4513 వేన్ ఫిబ్రవరి 5వ తేదీని చెక్ పోస్టు దాటినట్లుగా గుర్తించారు. సదరు వేన్ చాలా ఫుటేజుల్లో కనిపించడంతో అనుమానం వచ్చి, సదరు నంబరును ద్వారా సదరు వాహనం హైదరాబాద్ కు చెందినదిగా గుర్తించడం జరిగింది.ఆర్టీఓ ఆఫీసులో లభించిన సమాచారంతో హైదరాబాద్ కు ప్రత్యేక పోలీసు బృందం వెళ్ళి, స్థానిక పోలీసుల సహకారంతో వాహన యజమానిని కలవగా తన వాహనాన్ని తన స్నేహితుడికి లీజుకు ఇచ్చినట్లుగా తెలపడంతో, సదరు స్నేహితుడి వద్దకు వెళ్ళగా, అతడు తన వద్ద పని చేసే బహదర్ పూరలో ఉంటున్న (ఎ-1) పుస్టో పేంద్ర సింగ్ కు లీజుకు ఇచ్చినట్లుగా తెలిపారు.
పుస్టో పేంద్ర సింగ్ గురించి వాకబు చేయగా సదరు వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తన స్వంత ఊరు వెళ్ళినట్లుగా తెలిసింది. దీనితో సదరు వ్యక్తి రాక గురించి స్థానికుల సహకారంతో తెలుసుకొని, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చెయ్యగా, గతంలో తాను హైదరాబాద్ కు చెందిన యజమాని పాత ఆర్టీసీ బస్సులను వేలంలో కొని, వాటి భాగాలను వేరు చేసేందుకుగాను విజయనగరం పంపినట్లు, బస్సు పార్టులను వేరు చేసి, రాగి,ఇత్తడి వస్తువులను హైదరాబాద్ పంపగా, మిగిలిన ఇనుమును విజయనగరం ఎల్బీసి ఆఫీసు ప్రక్కన గల స్క్రాప్ కొట్టు యజమాని అబ్దుల్ రఫీకి అమ్ముతుండేవాడనన్నారు. ఆ సమయంలో ఆ షాపులో పని చేసే విజయనగరం పట్టణం లంకా పట్నంకు చెందిన గోక రాంబాబుతో పరిచయం ఏర్పడింది. రాంబాబుకు హిందీ రావడంతో నేను అతడితో తరుచూ మాట్లాడుతూ ఉండేవాడిని. ఇటీవల (ఎ-2) గోక రాంబాబు విజయనగరం స్క్రిప్ షాపులో పని మానేసినట్లు,తాను పని చేసిన షాపులో ఎక్కువగా ఇత్తడి, రాగి సరుకు ఉందని, దానిని అప్పగిస్తానని చెప్పడంతో, నేను గత సంవత్సరం అక్టోబరులో ఒకసారి, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒకసారి వచ్చి, అబ్దుల్ రఫీ స్ట్రాప్ షాపులో సరుకును దొంగిలించి, వేతో తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయి, అక్కడ సరుకును అమ్మేసినట్లుగా విచారణలో తెలిపాడు. (ఎ-1) పుస్టేపేంద్ర సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు లంకావట్నంకు చెందిన (ఎ-2) గోక రాంబాబును 1వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 150 కిలోల కాపరు వైరు, 50 కిలోల ఇత్తడి, రెండు సెల్ ఫోనులు, టాటా ఏస్ వేన్ (ఎపి 13ఎక్స్ 4513) మరియు రూ. లక్ష నగదును వారి నుండి స్వాధీనం చేసుకున్నట్లుగా డిఎస్పీ పి. అనిల్ కుమార్ తెలిపారు. ఈ కేసు విచారణను ఛాలెంజింగుగా స్వీకరించి, సుమారు 2 మాసాలు తీవ్రంగా శ్రమించి, నేరంకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా 1వ పట్టణ సీఐ జె.మురళి ఆధ్వర్యంలో 1వ పట్టణ ఎస్ ఐ లు కిరణ్ కుమార్, రాజా సుబ్రమణ్యం, హెచ్ సిలు అచ్చిరాజు, భాస్కరరావు, కానిస్టేబులు సునీల్, శివ, భాస్కర్ పని చేసారన్నారు. ఈ కేసును ఛేదించడంలో సమర్ధవంతంగా పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి కూడా అభినందించారన్నారు.విజయనగరం డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 1వ పట్టణ సిఐ జె.మురళి,ఎస్ ఐ లు కిరణ్ కుమార్, రాజా సుబ్రమణ్యం పాల్గొన్నారు.
No comments:
Post a Comment