Followers

చంద్రబాబు, రాజేష్ ఏకాంత చర్చలు

చంద్రబాబు, రాజేష్  ఏకాంత చర్చలు     


నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా రాజేష్ ను ప్రకటించనున్న బాబు       

తిరుపతి ఎన్నికల తర్వాత అధికారిక ప్రకటన    

పార్టీ సలహాలు, సూచనలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన            

అవసరమైతే ఆర్థికంగానూ పార్టీ ఆదుకుంటుందని బాబు భరోసా                       

పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చంద్రబాబుకు  రాజేష్ హామీ                    

హర్షం వ్యక్తం చేసిన తేదేపా శ్రేణులు                

 పెన్ పవర్, కందుకూరు

కందుకూరు నియోజకవర్గ  తేదేపా ఇన్చార్జిగా బాధ్యతలు ఎవరికి అనే గందరగోళానికి బుధవారంతో తెరపడింది. కందుకూరు లో పార్టీ కార్యక్రమాలకు,  పార్టీ బలోపేతానికి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న యువనేత రాజేష్ కు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నుంచి మంగళవారం పిలుపు వచ్చింది. రాజేష్ ఒక కార్యక్రమం కోసం స్వగ్రామం రావడంతో  చంద్రబాబు పిలుపుతో మంగళవారం రాత్రి రాజేష్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. బుధవారం బాబును తన నివాసంలో కలవగా రాజేష్ తో చంద్రబాబు  ఏకాంతంగా నియోజకవర్గ పరిస్థితిపై చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి పోరాడే మీ లాంటి యువకులు అవసరం ఎంతైనా ఉందని పార్టీ పూర్వ వైభవానికి యువకుల సేవలు ఈ సమయంలో అవసరమని మీ వెనుక నేను ఉంటానని రాజేష్ కు బాబు భరోసా కల్పించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో నియోజకవర్గంలో  అన్ని పంచాయతీలలో అభ్యర్థులను పోటీ చేయించి ఆర్థికంగానూ అండగా నిలిచిన రాజేష్ కు చంద్రబాబు అభినందనలు తెలిపినట్లు సమాచారం. రాజేష్ గత బుధవారం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. మరలా ఈ వారం రోజులలో మరోసారి రాజేష్ నివేదిక తెప్పించుకొని రిపోర్టు ఆధారంగా చంద్రబాబే స్వయంగా కలవాలని చెప్పడంతో నియోజకవర్గ ఇన్చార్జిగా రాజేష్ కు లైన్ క్లియర్ అయింది. అయితే తిరుపతి ఎన్నికలు తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గంలో  అధిష్టానం సూచనలు సలహాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అంతేకాక  గత 20 నెలల నుంచి పార్టీ తీవ్ర కష్టాల్లో ఉందని కష్టకాలంలో కార్యకర్తలను అన్ని విధాల ఆదుకుంటూ అండగా ఉంటున్న రాజేష్ సేవలను చంద్రబాబు కొనియాడారు అని సమాచారం. దేనికి భయపడవలసిన అవసరం లేదని అవసరమైతే ఆర్థిక సహాయ సహకారాలు కూడా పార్టీ అందజేస్తుందని కావున దూసుకెళ్లాలని బాబు భరోసా ఇచ్చారని చెప్పారు. పార్టీలో  మీరు చేపట్టిన కార్యక్రమాలు,  పార్టీ కష్టంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు మీరు అండగా నిలిచి, ఆదుకునే నాయకత్వ లక్షణం పార్టీ మీద అభిమానం తో మీరు చేస్తున్న కృషికి రాజేష్ ను బాబు అభినందించారు. కందుకూరు నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. సేవాగుణం, నిజాయితీ, మొండి పట్టుదల ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని ఈ లక్షణాలు నీకు మెండుగా ఉన్నాయని రాజేష్ ను  బాబు ఆశీర్వదించినట్లు తెలిసింది. పార్టీ  తనకు ఏ పని అప్పచెప్పిన అంకితభావంతో, చిత్తశుద్ధితో చేస్తానని చంద్రబాబుకు రాజేష్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే  గత కొన్ని నెలల నుండి కందుకూరు తేదేపా ఇంచార్జి పదవిపై వస్తున్న ఊహాగానాలకు బుధవారం తెరపడటంతో టిడిపి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, రాజేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. రాజేష్ వెంట సోదరుడు ఇంటూరి రమేష్ ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...