Followers

జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు రావులపాలెం క్రీడాకారులు

 జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు రావులపాలెం క్రీడాకారులు

పెన్ పవర్,రావులపాలెం

రావులపాలెంకు చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయ స్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారని నెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి తెలిపారు. బాలుర విభాగంలో జి.సాయిబాబా, బాలికల విభాగంలో యం. దీప్తి, పి.సుజాత ఎంపిక కాగా సోమవారం వీరిని రావులపాలెం సి.ఆర్.సిలో జరిగిన కార్యక్రమంలో అశోక్ రెడ్డి తదితరులు అభినందించారు. కృష్ణా జిల్లా నిడమానూరులో జరిగిన 6వ సీనియర్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా బాలికల జుట్టు ద్వితీయ స్థానం, బాలుర జుట్టు తృతీయ స్థానం సాధించాయన్నారు. ఈ పోటీల్లో ఈ ముగ్గురు క్రీడాకారులు ప్రతిభ కనబర్చి ఛత్తీస్ ఘడ్ లోని దుర్గ్ లో ఈనెల 24 నుంచి 27 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన క్రీడాకారులను జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి, కార్యదర్శి పల్లా శ్రీనివాసరావు, ట్రెజరర్ యస్. చంటి, పిఈటిలు రామారావు, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...