విశాఖ ఉక్కును రక్షించుకుంటాం
బంద్ కు సంఘీభావ సభలో.. వీరలక్ష్మీ
పెద్దాపురం,పెన్ పవర్
ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును పరిరక్షణకు ఉద్యమిస్తామని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎమ్.వీరలక్ష్మీ అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర బంద్ కు పిలుపుకు సంఘీభావంగా పెద్దాపురం మెయిన్ రోడ్ ఆంజనేయస్వామి గుడి సెంటర్ సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు అధ్యక్షతన సిఐటియు- ఎఐటియుసి- ఐఎఫ్ టియు ఆధ్వరంలో జరిగింది. ఈ సందర్బంగా వీరలక్ష్మీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలపైన కక్షకట్టిందని అన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం అంటే ఆంద్రప్రజల గౌరవాన్ని వమ్ముచేయడమే అని అన్నారు. 2 లక్షల కోట్ల విలువైన ఆస్ధులు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేవలం 5 వేల కోట్లుతో పోస్కో కంపెనీకి అమ్మడం చాలా దారుణమన్నారు. దీనిపైన పెద్దఉద్యమం నిర్వహించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి దాడి బేబి, సిఐటియు నాయకులు మాగాపు నాగు, ఐ.ఎఫ్.టి.యు నాయకులు ఇ.చిట్టిబాబు, ఎఐటియుసి నాయకులు రామకృష్ణ, త్రిమూర్తులు, కన్నూరి ప్రసాద్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కేదారి నాగు, సిఐటియు నాయకులు ఎస్.శ్రీనివాస్, ఐద్వా నాయకులు కూనిరెడ్డి అరుణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దారపురెడ్డి కృష్ణ, జాగారపు సూర్యకుమారి, మామిడి సత్యవేణి, ఉమామహేశ్వరి, డి.సత్యనారాయణ, ఎమ్.రాంబాబు, తదితరులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment