మాస్క్ ఉండాలా.. అంతా బాగుండాలా
సంతబొమ్మాళి, పెన్ పవర్
గత కొంత కాలంగా కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న నేపద్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మాస్కు తప్పని సరిగా ధరించాలి అని టెక్కలి సిఐ ఆర్ నీలయ్య, నౌ పడా ఎస్ ఐ మహమ్మద్ యాసీన్ ఆధ్వర్యంలో నౌపడ గ్రామంలో వాహన తనిఖీలు చేపట్టారు. ప్రజలు కరోనా భారిన పడకుండా ఉండాలంటే అందరూ మాస్క్‌లను తప్పనిసరిగా వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో చాలా మంది మాస్క్‌లు ధరించకుండానే రావడంపై సీఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్‌లు ధరించకుండా బయటికి వస్తే జరిమానా విధిస్తామన్నారు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ నడుస్తోందని, ఇది మరింత ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారని, ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు నివారణ చర్యలు పాటించాలన్నారు. మాస్క్ ధరించడంతో పాటు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం చేయాలన్నారు. 45 సంవత్సరాలు పైబడిన వారు కొవిడ్ టీకా వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment