పిఆర్సి ప్రకటన పై హర్షం వ్యక్తం చేసిన పిఆర్టియూ టీఎస్
పెన్ పవర్, మరిపెడపిఆర్టీయూ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పింగిళి శ్రీపాల్ రెడ్డి జరిపిన చర్చలలో ఇచ్చిన హామీ మేరకు నేడు శాసనసభలోముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించడాన్ని పిఆర్టియు రాష్ట్ర శాఖ అసొసియేట్ అధ్యక్షులు కుడితి ఉపేందర్ రెడ్డి,మండల శాఖ అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మంచి ఫిట్మెంట్, ఉద్యోగుల వయో పరిమితి పెంచడం,సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్,అంతర్జిల్లా బదిలీలు, ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హోదాతో కూడిన పదివేల ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరీ, ఉపాధ్యాయుల పదోన్నతులు, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఆరు నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి, అంగన్వాడి టీచర్లకు, విద్యా వాలంటరీలకు కూడా పిఆర్సీ అమలుపరచడం సంతోషకరమైన విషయం అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మండల శాఖ కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్ బాధ్యులు కరుణాకర్,వెంకన్న,నగేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment