Followers

ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ సెల్ ప్రారంభం

 ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ సెల్ ప్రారంభం 


కాగజ్ నగర్, పెన్ పవర్

జీవితంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగడానికి,  విద్యార్థి దశనుండే వారికి పారిశ్రామిక, వ్యాపార మెలకువలు అందించడానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్ సెల్ "ను ఏర్పాటు చేశారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు "ఎంటర్ ప్రెన్యూర్ షిప్" అంశంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కుమురం భీం జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎ.రవికృష్ణ మాట్లాడుతు విద్యార్థి దశనుండే విభిన్నంగా ఆలోచించడం అలవర్చుకుంటే ఏ రంగంలోనైన సులభంగా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు.విద్యార్థులు ఉపాధి పొందడం కాకుండా పది మందికి ఉపాధి కల్పించే దిశగా ఆలోచించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డి.లక్ష్మీనరసింహం మాట్లాడుతు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు విద్యార్థి దశనుండే జీవితంలో రాణించడానికి కావలసిన నైపుణ్యాలను ఈ విభాగం ద్వారా అందించనున్నట్లు తెలిపారు.ప్రతి నెలలో ఒక పారిశ్రామిక వేత్త,వ్యాపార వేత్తల ద్వారా విద్యార్థులకు కావలసిన మెలకువలు అందించడంతో పాటు సమీపంలోని పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు సందర్శించి ప్రత్యక్ష అనుభవాలు పోందేలా ఈ విభాగం కృషి చేస్తుందని  తెలిపారు.ఈ కార్యక్రమంలో  వైస్ ప్రిన్సిపాల్ డి.జనార్ధన్, అధ్యాపకులు ఎం.రాజేశ్వర్, ఎస్.సునిల్కుమార్, ఎల్. మధుకర్ మధుకర్

పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...