ఎఎస్ఓ జోడాల వెంకటేశ్వరరావుకి కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్
తాళ్ళపూడి, పెన్ పవర్తాళ్ళపూడి పిహెచ్సి లో శుక్రవారం ఎఎస్ఒ జోడాల వెంకటేశ్వరరావు కోవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయించుకున్నారు. జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒక నెల క్రితం మొదటి డోస్ వేయించుకున్నానని, ఈ రోజు సెకండ్ డోస్ వేయించుకోవడం జరిగిందని అన్నారు. మొదటి డోస్ వేయించుకున్న తరువాత ఆరోగ్యపరంగా ఏ ఇబ్బందులు లేవని తెలిపారు. అపోహలు పడకుండా అర్హత ఉన్న ప్రతీఒక్కరు వేయించుకోవచ్చునని తెలిపారు. అందరూ భయపడకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
No comments:
Post a Comment