ఓయూ లో ముమ్మురంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
తార్నాక , పెన్ పవర్
ఉస్మానియా యూనివర్సిటీ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారం జోరుగా సాగుతుంది. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ పరిధిలోని ఉద్యోగస్తులను, విద్యార్థులను కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణి దేవి, మరియు పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని విద్యార్ధి నేతలు కోరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ శ్రేణులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ విద్యార్ధి నేతలు చటారి దశరథ్, శ్రీకాంత్ గౌడ్, జంగయ్య, కాటం శివ, బొల్లు నాగరాజు, రమేష్ గౌడ్, రవీందర్, రాజు, సురేష్, రాజేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment