న్యాయవాదుల జంట హత్యలపై సిబిఐ విచారణ చేపట్టాలి
కూకట్ పల్లి/పెన్ పవర్
న్యాయవాదుల జంటహత్యల విచారణలో జరుగుతున్న జాప్యాని నిరసిస్తూ పెడరేషన్ ఆఫ్ బార్ తెలంగాణ పిలుపు మేరకు విధులు బహిష్కరించి కూకట్ పల్లి కోర్టు ముందు న్యాయవాదులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల దారుణ హత్యపై న్యాయవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయని, కేసులో అసలైన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ న్యాయవాదులు సంతకాల సేకరణ, రిలే నిరాహారదీక్షలు, రహదారి ముట్టడిలు చేస్తున్న సరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాద దంపతుల కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన సమయంలో ఉద్యమాలు చేసినప్పుడు న్యాయవాదుల ఆవేశం చూశారని, ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించక పోతే ఉద్యమ సమయంలో చూసిన న్యాయవాదుల ఆగ్రహాన్ని మళ్ళీ చూస్తారని హెచ్చరించారు. హత్యపై సీఎం కేసీఆర్ స్పందించి తక్షణమే న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈహత్యల కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు జి.శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వర్ రెడ్డి, శేఖర్ బాబు, నాగేశ్వరరావు, కేశవరావు, నరేందర్ రెడ్డి, నర్సింగరావు, రాజేష్, రాంబాబు, పద్మారావు, శ్రీనివాస్ సింగ్, మహిళ న్యాయవాదులు శ్రీదేవి, హేమలత, శ్రీలత, షాలిని ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment