వైఎస్ఆర్ వెలుగు కార్యాలయం లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
పెన్ పవర్,వలేటివారిపాలెం
మండలంలోని వైఎస్సార్ క్రాంతి వెలుగు కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహిళా సమాఖ్య కోశాధికారి ముప్పా హరిత ఆధ్వర్యంలో మహిళలకు కబడ్డీ, కుర్చీలాట, ఉపన్యాసం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఉత్తమ సేవ చేస్తున్న వారికి మగువ పురస్కారాన్ని ఇవ్వడం అభినందనీయమన్నారు. కొండ సముద్రం గ్రామ సర్పంచ్ మన్నం వెంగమ్మ మాట్లాడుతూ నేటి తరంలో మహిళలను పురుషులతో సమానంగా గౌరవింపబడటం చాలా సంతోషంగా ఉందన్నారు. మహాళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, మహిళా దినోత్సవం కేవలం ఒకరోజు మహిళను గౌరవించే విధంగా కాకుండా ప్రతి రోజూ మహిళను గుర్తించి మహిళలను గౌరవించే సమాజాన్ని తయారుచేయాలని , తద్వారా మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ ను సన్మానించారు. అనంతరం పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం హనుమంతరావు, సిసి అనితా , వివిధ శాఖల మహిళలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment