మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యానిలకు సన్మానం
పరవాడ,పెన్ పవర్
గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,పరవాడ నూతన సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు ముందుగా మహిళ సోదరీమణులును అభినందించి , అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించిన సమాజమే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలకు యావత్ సమాజం అండగా నిలవాలని, మహిళలు స్వయం సమృద్ధి సాధించి పురోగమించాలని కొనియాడారు.స్త్రీ లేకపోతే అసలు జననమే లేదని,స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదని పేర్కొన్నారు.మహిళలు బాగుంటేనే దేశం, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పారు.మన ఆంద్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన నేరుగా మహిళల ఖాతాలు లోకే జమ చెయ్యడం చాలా అభినందనీయం అని చెప్పారు.ఈ యొక్క ఘనత మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దక్కింది అని చెప్పారు. అనంతరం నుతన సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు ని ఉప సర్పంచ్ బండారు రామారావు ని ఉపాద్యాయులు ఘన సన్మానం చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పిఎంసి చైర్మన్ పయిల హరీష్ ,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,14 వ వార్డు మెంబెర్ సిరిపురపు రాజేష్, పయిల పైడం నాయుడు, ఉపాధ్యాయులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment