Followers

సి.డబ్ల్యు.సి. గోడౌన్ కార్మికుల ఉపాధిని పరిరక్షించాలి

 సి.డబ్ల్యు.సి. గోడౌన్ కార్మికుల ఉపాధిని పరిరక్షించాలి

పెన్ పవర్,తాడేపల్లిగూడెం

రాష్ట్రంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ కు చెందిన గోదాముల్లో పని చేస్తున్న జట్టు కూలీల ఉపాధిని పరిరక్షించాలని ఏ.ఐ.టి.యు.సి. జిల్లా గౌరవాధ్యక్షుడు డి.సోమ సుందర్ విజ్ఞప్తి చేశారు.స్థానిక సి.డబ్ల్యు.సి.గోడౌన్ లేబర్ యూనియన్ సర్వ సభ్య సమావేశం శుక్రవారం  గోదాముల ఆవరణలోని యూనియన్ ఆఫీస్ లో జరిగింది. యూనియన్ కార్యదర్శి ఎర్రగోగుల వీర్రాజు అధ్యక్షత వహించారు.డి.సోమ సుందర్ మాట్లాడుతూ కేంద్ర గిడ్డంగులసంస్థ గోదాముల్లో రాష్ట్ర  పౌరసరఫరాల సంస్థ   సరుకులను నిలవఉంచడం వల్ల ప్రభుత్వగోదాముల్లో పనిచేసే  జట్టు కార్మికులకు ఉపాధి లభిస్తున్నదన్నారు.అయితే కేంద్రగిడ్డంగుల్లో సరుకులు నిల్వఉంచే విధానాన్ని మార్చడానికి రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందని, దీనివల్ల కేంద్రప్రభుత్వ  గిడ్డంగుల్లో పనిచేసే జట్టు కార్మికులకు ఉపాధిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు.దీనిపై ఏ.ఐ.టి.యు.సి.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, ఉపప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో విజయవాడలో  కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నూ, ఇతర ఉన్నతాధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లామని సోమసుందర్ వివరించారు. కార్మికుల ఉపాధికి దెబ్బ తగులకుండా స్టొరేజి విధానం ఉండాలని కోరారన్నారు.అధికారులు సానుకూలంగా స్పందించారని సోమసుందర్ తెలిపారు.ఉపాధిని కాపాడుకోవడానికి జట్టు కార్మికులు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు.ఏ.ఐ.టి.యు.సి. ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తాడికొండ శ్రీనివాస రావు మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.యూనియన్ నాయకులు ఎర్ర గోగుల వీర్రాజు,  యాండ్రాపు  అర్జున, గోకా నాగరాజు, సురేష్, చంద్రరావు, ఏడుకొండలు, వెంకటేష్ తదితరులు మాట్లాడారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...