Followers

పిల్లలకు మాస్కులు పంపిణీ...

పిల్లలకు మాస్కులు పంపిణీ...


గోకవరం,పెన్ పవర్
మండలంలోని రంప యర్రంపాలెం గ్రామంలో విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలకు గ్రామస్తులు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. రంప యర్రంపాలెం గ్రామములోనిదేవి సెంటర్ లో గల ఎమ్ పి పి పాఠశాల లోని 200 మంది పిల్లలకు ఎస్ సి పేట లోని అంగన్వాడి సెంటర్ లో ఉన్న 35 మంది పిల్లలకు స్థానిక టైలర్ పంతం సత్యనారాయణ స్వయంగా మాస్కులు కుట్టి గ్రామ సర్పంచ్ బాదంపూడి హర్షిత, ఉప సర్పంచ్ దాకా రుపు ధర్మరాజు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాదంపూడి ప్రకాష్, గంధం బాబురావు, అల్లాడి సింహాచలం, ఉపాధ్యాయులు అంగన్వాడీ సిబ్బంది, టి. బుజ్జమ్మ, కె. పాపాయమ్మ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...