ప్రాధమిక ఆరోగ్యకేంద్రాని పరిశీలించిన కార్పొరేటర్ దొడ్ల
కూకట్ పల్లి, పెన్ పవర్
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఆసుపత్రి ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన మెట్ల ర్యాంప్ నడవడానికి అసౌకర్యంగా ఉండటం గమనించిన ఆయన తక్షణమే దానిని తొలగించి, ఆసుపత్రికి వచ్చే ప్రజలు, మరియు రోగులు, ముఖ్యంగా గర్భిణి స్త్రీలు నడవడానికి సౌకర్యంగా ఉండేలా మరింత ఎటవాలుగా కొత్త మెట్లను నిర్మించాలని ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందించారు. కరోన కాలంనుండి ప్రాణాలకు తెగించి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, బీసీసెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, వార్డుమెంబెర్ చిన్నోల శ్రీనివాస్, వాసుదేవ్ రావు, డాక్టర్. ప్రవీణ్ ఇతర ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment