Followers

పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం

పౌష్టికాహారం తోనే  సంపూర్ణ ఆరోగ్యం:  పన్నాల 

తార్నాక,  పెన్ పవర్ 

పోషక పక్ష వారోత్సవాల్లో భాగంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  అంగన్వాడీ టీచర్లు  మల్లాపూర్ అంబెడ్కర్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు, పిల్లలు డివిజన్  స్థాయి ఉద్యోగులతో  పౌష్టికాహరంపై అవగాహన కల్పించారు.  స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు.  పోషణ, పెరటి తోటలు శుభ్రత పరిశుభ్రత,గురించి, మరియు పోషణ లోపం, ఆహార వైవిద్యత, తల్లిపాల ప్రాముఖ్యత అనుబంధ పోషకాహారం, శుభ్రత పరిశుభ్రత పై ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే అంశాన్ని వివరించారు. సమతుల్య ఆహారం గర్భిణీ స్త్రీలకు, మరియు బాలింతలకు పిల్లలకు సేంద్రియ ఎరువులతో తయారు ఐనా పోషక ఆహారం ఎలా తీసుకోవాలనే అంశం వివరించారు. ప్రతి ఒక్కరు మన ఇంటి పరిసర ప్రాతాలలో ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా ఆకుకూరలు, కూరగాయలు సేంద్రియ ఎరువులు వాడి పండించుకోవాలి సూచించారు. బయట కల్తీ ఆహారం పదార్ధాలు విక్రయిస్తున్నారు. కాబట్టి మన కుటుంబంకు సరిపడా ఆహార కూరగాయలు ఆకు కూరలు మనమే పండించుకోవాలి వాటిని మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు.అంగన్వాడీ  సూపెర్వైసోర్ సఖుబాయి , అంగన్వాడీ టీచర్స్ వాని , స్వరూప , దేవకరణ , మమతా , నాగరాణి , హిమబిందు , రామేశ్వరి , గాయత్రి , మధునా , అరుణ కుమారి , గోపమ్మ , అనురాధ , సుజాత , శ్రీలత ఉన్నారు. వారితో పాటు స్థానిక తెరాస నాయకులు దుర్గ మాధవి , సనాల రవి , జెర్రిపోతుల విజయభాస్కర్ , విద్యార్ధి విభాగం  నాయకులు శ్రవణ్ , వినయ్ రెడ్డి పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...