కార్మిక ,రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి
మందమర్రి, పెన్ పవర్
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు, కార్మికుల చట్టాలు, హక్కుల రక్షణకు దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా శనివారం మందమర్రి ఏరియాలోని సింగరేణి జిఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే వాణిజ్య మైనింగ్, కొత్త లేబర్ కోడ్ లు, కొత్త స్టాండింగ్ ఆర్డర్స్ లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సంస్కరణల చట్టాలను పూర్తిగా నిలిపివేయాలి అన్నారు. సీఎంపిఎఫ్ ను ఈపీఎఫ్ లో కలిపే ప్రతిపాదనలను విరమించుకోవాలని, 11వ వేజ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసి వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. డిఎ లెక్కలలోని అవకతవకలు సరిచేయాలన్నారు. కార్మికులకు ఎన్ఓసి సరళతరం చేయాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను డిపిసి ద్వారా ప్రతి ఆరు నెలలకోసారి పారదర్శకంగా భర్తీ చేయాలని, అలవెన్సులు పై ఆదాయపు పన్ను తిరిగి చెల్లించాలన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ వేతనాలు అమలు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మందమర్రి ఏరియా అధ్యక్షులు ఎస్ వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శి రామగిరి రామస్వామి, ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్ నాయకులు గూళ్ల బాలాజీ, రాజమల్లు, సింగ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment