అసెంబ్లీ ముట్టడికి జిల్లా భాజపా ఎస్సీ మోర్చా నాయకుల యత్నం... అరెస్ట్
వేములవాడ, పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా భాజపా ఎస్సీ మోర్చా నాయకులు బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి... ఎలాంటి చర్యలు తీసుకోలేదని భాజపా ఎస్సీ మోర్చా నాయకులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ఎస్సీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.... భాజపా ఎస్సీ మోర్చా నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. భాజపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు భాజపా శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి... ఎలాంటి చర్యలు తీసుకోలేదని భాజపా ఎస్సీ మోర్చా నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి దళిత రాష్ట్ర నాయకులు కుమ్మరి శంకర్, జిల్లా బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment