Followers

ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్థి వాణిదేవిని గెలిపించాలని కోరిన ఎంపీపీ..

 ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస అభ్యర్థి వాణిదేవిని గెలిపించాలని కోరిన ఎంపీపీ..

పెన్ పవర్,మేడ్చల్

మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీపీ పద్మజగన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఆర్ఎస్ అభ్యర్థి వాణి దేవి ని మొదటి ప్రాధాన్యత ఓటు తో గెలిపించాలని కోరారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆయన కూతురు వాణి దేవిని గెలిపిస్తే ఓటర్లకు న్యాయం చేస్తారని అన్నారు. గత పిఆర్సి లో మంచి ఫిట్మెంట్ ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి కూడా మంచి ఫిట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కరోనా కారణంగా ఎంతమేరకు ఇవ్వాలనేది యోచిస్తున్నది అని అన్నారు. ఉద్యోగులందరూ సంతృప్తి చెందేలా ఫిట్మెంట్ ఇస్తుందని చెప్పారు. టిఆర్ఎస్ ను గెలిపించాలని, ఈ విషయాన్ని మంత్రి మల్లారెడ్డి సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇటబోయిన బాబు యాదవ్, ఎంపీటీసీ నిరుడి రఘు, వార్డు సభ్యులు, నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...