Followers

విద్యార్థులు అభినందించిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం

 విద్యార్థులు అభినందించిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం

మందమర్రి, పెన్ పవర్

మందమర్రి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం గురువారం పాఠశాల విద్యార్థులకు అభినందన సభ నిర్వహించి, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయూబ్ మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాల నుండి నేషనల్ స్పేస్ సెటిల్మెంట్ (ఎన్ఎస్ఎస్) ఆర్గనైజిర్ ద్వారా నాసాకు ప్రాజెక్టును పాఠశాల విద్యార్థులు నిర్వహిస్తున్నారని, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ వారు అభినందన పత్రాలు పంపించగా, నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని గురువారం విద్యార్థులకు అభినందన పత్రాలు అందజేసినట్లూ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డిజిఎం లక్ష్మణ్ రావు, ఆర్ఐ రాజు, అకాడమీ కోఆర్డినేటర్ కృష్ణారావు లు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ నాగేశ్వరరావు, గైడ్ టీచర్ పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...