Followers

తడి పొడి చెత్త సేకరణ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి

 తడి పొడి చెత్త సేకరణ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి

మహారాణి పేట, పెన్ పవర్

జీవీఎంసీ జోన్ టు పరిధిలో పనిచేస్తున్న తడి పొడి చెత్త సేకరణ కార్మికులకు ఎనిమిది నెలల బకాయి జీతాలు చెల్లించాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, నేరుగా కార్పొరేషన్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు నాయకులు వి కృష్ణారావు మాట్లాడుతూ 2008 నుండి పని చేస్తున్నటువంటి తడి పొడి చెత్త సేకరణ కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా కార్మికులను దోపిడీ చేస్తున్నటువంటి కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలన్నారు. కరోనా సమయంలో కూడా వీరి ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షణగా పనిచేశారని అన్నారు. ఆ సమయంలో కూడా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదన్నారు. 

ఎనిమిది నెలలుగా జీతాలు లేకపోవడం వల్ల ఇంటి అద్దెలు కట్టుకోలేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నారు అని తెలిపారు. ఇప్పటికే ముగ్గురు కాంట్రాక్టర్లు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టు అప్పలరెడ్డి కి ఈనెల 31తో టెండర్ అయిపోతుందని గుర్తు చేశారు. వీరికి తక్షణమే కార్పొరేషన్ జీతాలు చెల్లించే విధంగా కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే 2019 నుండి ఇ.యస్.ఐ, పీఎఫ్ డబ్బులు జమచేయకుండా కాంట్రాక్టర్లు వాడుకున్నారని, వాటిని కార్మికులకు చెల్లించాలన్నారు.ధర్నా అనంతరం కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అనపర్తి అప్పారావు, కే.కుమారి, తడి పొడి చెత్త సేకరణ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్,సూరిబాబు,కమిటీ సభ్యులు గణేష్,వేణు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...