మరొకసారి అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్సీ రామచంద్రరావు
కూకట్ పల్లి,పెన్ పవర్
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు స్పీడ్ ని పెంచారు. కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ లో మంగళవారం విరమల్ల. కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవాదులతో చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల గొంతుగా మారేందుకు మరొక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈసారి పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ అయిన న్యాయవాదులు ఓట్లు నమోదు చేసుకోవడం జరిగిందని, గత కొన్ని రోజులుగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, జడ్చర్ల, నాంపల్లి కోర్టులతో పాటు కూకట్ పల్లి కోర్ట్ ని కూడా సందర్చించడం జరిగిందని, కూకట్ పల్లి కోర్టును త్వరగా నిర్మించాలని కౌన్సిల్ లో మాట్లాడటం జరిగిందని, హైకోర్టు విభజన, న్యాయమూర్తుల పంపకాలలో సైతం స్పందించడం జరిగిందని, లాయర్లకు అందాల్సిన సంక్షేమ పథకాలుపై న్యాయశాఖ మంత్రికి కూడా వినతిపత్రం అందజేసమని తెలిపారు. అలాగే వామన్ రావు దంపతుల హత్య లాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చేస్తున్న ఆందోళనకు తాను పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు రామచంద్రరావు తెలిపారు. కేంద్రానికి ఈ విషయంపై సిఫార్సు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు నరేందర్ రెడ్డి, శ్రీకర్ రావు, రఘు, దేవ్, ధర్మేష్, యాదయ్య, శివగౌడ్, మహిళ న్యాయవాదులు, మరియు జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment