Followers

భక్తి శ్రద్ధలతో షబెబరాత్ ప్రార్థనలు

భక్తి శ్రద్ధలతో షబెబరాత్ ప్రార్థనలు

 విశాఖ  తూర్పు,పెన్ పవర్

షబెబరాత్ సందర్భంగా ముస్లిం సోదరులు  యం.వి పి కాలనీ అల్ మదీన మసీదు లో   ప్రత్యేక నమాజ్,ఖురాన్ పఠనం చేశారు.ఈ సందర్భంగా నమాజ్ అనంతరం ముస్లిం మత బోధకులు ఇమామ్ అబ్దుల్  ఖాయ్యుం  షబెబరాత్ విశిష్టత తను తెలియజేస్తూ షబెబరాత్ సమయంలో పశ్చతాప  భావంతో,నిర్మలమైన హృదయం తో దైవ సానిద్యం లో ,భక్తి తత్పరణతో గడిపి,తన పూర్వ అపరాదలన్నింటికి క్షమాపణ కోరితే వాటిని అల్లాహ్ మన్నిస్తాడాని పవిత్ర గ్రంధాలు తెలియజేస్తున్నాయన్నారు.

అనంతరం  జీ వి యం సి లో గెలిచిన మైనారిటీ కార్పొరేటర్ ల కు సన్మాన కార్యక్రమము చేపట్టం జరిగింది 17 వార్డ్, లావణ్య,  39 వార్డ్ సాధిక్  ,53 వార్డ్  . బర్కత్ అలి ల కు  శాలువా కప్పి పుష్పాకుచ్యలతో సన్మానం చేయటం జరిగింది  ఈ కార్యక్రమములో యం ఎల్ .ఏ . వెలగపూడి రామకృష్ణ బాబు  పాల్గొన్నారు  అల్ మదీన మసీదు సదరన్  అబ్బాస్ రహీ,సెక్రెటరీ ఎగ్బల్ ,సుఖీభవ హుస్సేన్,  ఖాన్ సాహెబ్ ,అబ్దుల్ ఖయ్యుం, బాబా, పాల్గొనటం జరిగింది అనంతరం భోజన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...