ఆరోగ్యకరమైన జీవనం కోసమే జిమ్ ల ఏర్పాటు...
ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న
రూ 40 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్, పెన్ పవర్
పట్టణ ప్రజలు ఆరోగ్యకరమైన జీవనం గడపడానికి కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 40 లక్షల వ్యయంతో జిమ్ ల ఏర్పాటు చేయడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం పట్టణ ప్రజలు వ్యాయామం చేయడానికి వీలుగా ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన 4 ఓపెన్ జిమ్ లను ఎమ్మెల్యే జోగురామన్న ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, టిఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించరు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓపెన్ జిమ్ లను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. తద్వారా ఆరోగ్యకర జీవనాన్ని గడపాలని ప్రజలకు సూచించరు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతుందని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు సతీష్, టిఆర్ఎస్ నాయకులు వాగ్మారే శైలేందర్,యునూస్ అక్బని, పట్టణ వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment