ఏపిసిపియస్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జోడాల వెంకటేశ్వరరావు కు సన్మానం
తాళ్లపూడి, పెన్ పవర్ఏలూరు లోని ఎపియన్జిఓ హోమ్ లో జరిగిన ఏపిసిపియస్ ఉద్యోగుల సంఘం 12 వ రాష్ట్ర కార్య వర్గ సమావేశంను విజయవంతంగా జరిపించినందున రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మరియు ఇతర రాష్ట్ర భాద్యులు పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జోడాల వెంకటేశ్వర రావు ను సన్మానించారు. రాష్ట్ర భాద్యులతో నడుస్తూ సీపీయస్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్లి సమస్య సాధనలో ముందుగా నిలబడతామని జిల్లా ప్రధాన కార్యదర్శి జోడాల వెంకటేశ్వరరావు తెలియజేసారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రెసిడెంట్ వీరవల్లి వెంకటేశ్వర రావు, రాష్ట్ర భాద్యులు గణేశ్వరరావు, మరొక రాష్ట్ర భాద్యులు దుర్గారావు, ఏడుకొండలు, పోతురాజు, భోజన సదుపాయాన్ని కల్పించిన బొందల శ్రీనివాసరావు, కండెల్లి రాంబాబు, మిగిలిన జిల్లా కార్యవర్గంలోని సభ్యులు కరకా సత్యనారాయణ, ఆశీర్వాదం వీరందరి వలననే విజయవంతం ఐనది అని జోడాల తెలియజేసారు.
No comments:
Post a Comment