వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
పెన్ పవర్,కరపగ్రామాల్లోని ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుధ్యపనులు నిర్వహణ, తాగునీటి సరఫరా చేసేందుకు, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలుచేయాలని మండల ఈఓపీఆర్టీ సీహెచ్ బాలాజీవెంకటరమణ అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శనివారం కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పండ్లు, గ్రామకార్యదర్శులు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గేడ్-1, గ్రేడ్-5 కార్యదర్శులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిపధ్య పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈనెల 29వ తేదీవరకు అమలుచేసే 'జలసంరక్షణ జనసంరక్షణ కార్యక్రమం గురించి వివరించి ఏరోజు, ఏయే కార్యక్రమాలు నిర్వహించాలో ఆయన వివరించారు. ఆడబ్యూఎస్ ఏఈఈ పి.ప్రసాద్ మాట్లాడుతూ తాగునీరు వృధాగా పోకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. పైపులైన్ మరామ్మతు పనలు చేయించాలన్నారు. డిప్యూటీ తహసీల్దార్ పి.శ్రీనివాసరావు, కరప పీహెచ్సీ డాక్టర్ ఎస్.2ిరీష, అర్ఐ పేపకాయల మాచర్రావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment