వారణాసికి బయలుదేరిన మహాశివరాత్రి ప్రత్యేక బస్సులు
పెన్ పవర్ , రావులపాలెం
మహాశివరాత్రి రోజున కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకునే విధంగా రావులపాలెం ఆర్టీసీ డిపో నుంచి ఏర్పాటు చేసిన 12 రోజుల కాశీయాత్రకు సంబంధించిన రెండు బస్సులు ఆదివారం బయలుదేరాయని డిపో మేనేజర్ టి.అజితకుమారి తెలిపారు. ఈ యాత్రలో భాగంగా బస్సులు అరసవిల్లి, పూరీజగన్నాధ్, కోణార్క్, భువనేశ్వర్, బుద్దగయ మీదుగా ఈనెల 11వ తేదీ మహాశివరాత్రి రోజుకి వారణాసి చేరుకుంటాయన్నారు. అక్కడ నుంచి వారణాసి గంగాహారతి, గంగా యమునా సరస్వతీ నదీ సంగమం, అయోధ్య రామ మందిరం, నైమిషారణ్యం, గోమతి నదీ స్నానం, గయ, ఉజ్జయినీ, ఓంకారేశ్వరజ్యోతిర్లింగ దర్శనం, ఘృషేశ్వర జ్యోతిర్లింగ దర్శనము, యాదగిరి గుట్ట, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని రావులపాలెం చేరుకుంటాయన్నారు.
No comments:
Post a Comment