Followers

అంగనవాడి సెంటర్లో వంటల పోటీ

 అంగనవాడి సెంటర్లో వంటల పోటీ

చిన్నగూడూరు,  పెన్ పవర్

చిన్న గూడూరు మండల కేంద్రంలోనీ శనివారం నాడు చిన్నగూడూరు సెక్టర్ అంగన్వాడి కేంద్రం 3లో ఈరోజు పిల్లల తల్లిదండ్రులకు వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సెంటర్ టీచర్ కవిత మాట్లాడుతూ... పోషణ పక్షం 16 నుండి  31 మార్చి వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించ వలెను అని వారు అన్నారు. అందులో భాగంగా ఈరోజు వంటల పోటీ నిర్వహించినాము అని తెలిపారు. పాలకూర చపాతీ మునిగాకు చపాతి విటమిన్స్ పదార్థాలు వచ్చేవాడిని తీసుకుని ఉండటం జరిగినది వారు అన్నారు. ఆహార వైవిద్యం యొక్క ప్రాముఖ్యత అనుబంధ పోషకాహారం సరైన ఆహార అలవాట్ల గురించి వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా, తల్లిదండ్రులు, పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...