మండలంలో ఘనం గా నిర్వహించిన ప్రపంచ జల దినోత్సవ కార్యక్రమం
పరవాడ,పెన్ పవర్
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మడలం లో గ్రామాల్లో ర్యాలీలు,మనవహారాలు నిర్వహించి నీటి యొక్క సంరక్షణ కొరకు ప్రతిజ్ఞలు చేయడం లాంటి కార్యక్రామలు నిర్వహించారు.పరవాడ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ప్రజా పరిషత్ అధికారి హేమ సుందరరావు,రాష్ట్ర సీఈసీ పయిల శ్రీనివాస్ రావు హాజరు అయ్యారు. ముందుగా పరవాడ సంతబయలు నుండి రామాలయం విధి మీదుగా ఎలిమెంటరీ స్కూల్ నుండి సంతబయలు వరుకు ర్యాలీ గా వెళ్లి అనంతరం మానవహారం ఏర్పాటు చేసిన అనంతరం సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు.గ్రామ సభ ను ఉద్దేశించి ఎంపిడివో హేమ సుందరరావు మాట్లాడుతూ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మనం నీటిని కాపాడాలి,ప్రతి నీటి బొట్టు వెలువైందిగా భావించి మనమందరం నీటిని సంరక్షించుకోకపోతే మనకు,మన భావితరాలకు నీరు దొరకడం కష్టమతుంది అని అన్నారు.
నీరు లేక పోతే మనిషి జీవితం ఎండమావే అవుతుంది తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి అని సూచించారు.ప్రజలందరూ ఎవరికివారు తమ ఇళ్లల్లో ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకుంటే వర్షపునీరు, మనం వాడుకునే నీరు భూగర్భంలోకి వెళ్లి భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి తెలియజేసారు. మనం వాడుకున్న నీరు ఇంకిపోయి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండి దోమలు లేకుండా, జబ్బులు రాకుండాఉంటుంది అని అన్నారు.రక్షిత మంచినీటి సదుపాయం లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు అని అధికారులు దీనిపై దృష్టిపెట్టి ప్రజలకు మంచి నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అని కోరారు.ప్రభుత్వమే చేయాలి మనకు ఎందుకులే అని ప్రజలు భావించకుండా ఇది ప్రతీ ఒక్కరి భాద్యత అని భావించి మనం మన ఇళ్లల్లో నీటిని పొదుపు గా వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటే భావితరాలకు మేలు చేసిన వారిమి అవుతామని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,ఉప సర్పంచ్ బండారు రామారావు,వ్యవసాయ అధికారిణి చంద్రావతి, ఏపీఓ భాగ్యలత,ఏపీఎమ్ సాయిరమేష్,పంచాయతీ సెక్రెటరీ అచ్చుతరావు,ప్రభుత్వ అధికారులు ,పిఎంసి చైర్మన్ పయిల హరీష్ ,పయిల టీవీ అప్పారావు, వాలంటీర్స్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.వెన్నెల పాలెం గ్రామంలో ఉప సర్పంచ్ సన్యాసిరావు ఆధ్వర్యంలో గ్రామస్థులు,వాలంటీర్లు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఈ మర్రిపాలెం గ్రామంలో బొద్ధపు చిన్నారావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.భరిణికం లో పేదిసెట్టి శేఖర్ ఆధ్వర్యంలో,పేద ముసిడి వాడాలో సర్పంచ్ కాబాడీ అప్పారావు,బుజ్జి ఆధ్వర్యంలో,రావాడ లో సర్పంచ్ మోటూరి సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో,జల సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
No comments:
Post a Comment