శ్రీనిధి అవార్డు ప్రధానం
మందమర్రి, పెన్ పవర్మందమర్రి మున్సిపాలిటీ ప్రత్యేక బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి హాజరై శ్రీనిధి అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి మాట్లాడుతూ, శ్రీనిధి రుణాల లక్ష్యాన్ని వంద శాతం సాధించినందుకు ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గాదె రాజు, మెస్మా టిఎంసిఏ రఘురాం, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ ప్రభాకర్, మందమర్రి పట్టణ సమాఖ్య కోశాధికారి రాధా, కార్యదర్శి సంధ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment