Followers

షీ టీం పై అవగాహన పెంచుకోవాలి.

 షీ టీం పై అవగాహన పెంచుకోవాలి.

జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజన్నసిరిసిల్ల ,పెన్ పవర్




గౌరవ నీయులైన రాజన్న సిరిసిల్ల ఎస్పీ  రాహుల్ హెగ్డే  ఆదేశాల మేరకు

సిరిసిల్ల టౌన్ సి.ఐ  ఆధ్వర్యంలో విజ్ఞాన వర్దిని హై స్కూల్  లో షీ టీమ్ ప్రోగ్రాం,100డయల్, మరియు ఆడపిల్లలపై జరుగుతున్న ఆగయిత్యాల గురించి యువత -భవిత వంటి అంశాల గురించి అవగాహనా చేయడం జరిగింది. మరియు టౌన్ ఎస్.ఐ రాజశేఖర్  ఆధ్వర్యంలో బస్టాండ్ ఏరియాలోజిల్లా పోలీసు కళా బృందం వారి సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు కళా బృందం సభ్యులు ప్రజలను చైతన్యం చేస్తూ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రోడ్డు ప్రమాదాలు, బాల్య వివాహాల నివారణ, మూఢ నమ్మకాల ద్వారా జరిగే అనర్థాలు, ఈవ్ టీజింగ్, బాలలు మరియు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులవంటి సామాజిక రుగ్మతల గురించి  వివరిస్తూ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలు చైతన్యం కావడంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్న ఎస్పీ సందేశాన్ని వివిధ కళా రూపాలలో వినిపించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...